Saturday, November 23, 2024

TS | దోస్త్‌ నోటిఫికేషన్ రిలీజ్.. 6 నుంచి మొదటి విడుత రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీస్‌ తెలంగాణ (DOST-2024) నోటిఫికేషన్‌ను (DOST Notification) ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. దీనిద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, మహిళా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, పాలిటెక్నిక్‌లో డీ-ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం మూడు విడుతల్లో అడ్మిషన్‌ ప్రక్రియను నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

మొదటి విడుత రిజిస్ట్రేషన్లు మే 6న ప్రారంభమవుతాయి. ఈ నెల 25 వరకు విద్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు మే 15 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చుకోవచ్చు. జూన్‌ 3న సీట్లను కేటాయిస్తారు. జూన్‌ 4 నుంచి 10వ తేదీ వరకు విద్యర్థులు సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

సెకండ్‌ ఫేస్‌ రిజిస్ట్రేషన్‌ జూన్‌ 4న ప్రారంభమవుతుంది. 13వ తేదీవరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. జూన్‌ 4 నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ చేసుకోవచ్చు. ఇక జూన్‌ 18న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో జూన్‌ 19 నుంచి 24వ తేదీలోపు సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

ఇక చివరిదైన మూడో విడుత రిజిస్ట్రేషన్‌ జూన్‌ 19న ప్రారంభమవుతుంది. జూన్‌ 25 వరకు అభ్యర్థులు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవచ్చు. అదే నెల 19 నుంచి 26 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ ఇవ్వవచ్చు. జూన్‌ 29న సీట్లను కేటాయిస్తారు. అదే రోజు నుంచి జూలై 3 వరకు విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. కాగా, మూడో విడుత రిజిస్ట్రేషన్లకు విద్యార్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. జూలై 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement