టోక్యో పారా ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో పసిడి పతకం సాధించిన ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అతడిని 18 నెలలపాటు సస్పెన్షన్ విధిస్తున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించింది. డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొ్ది. దీంతో ప్రమోద్ 2024 పారిస్ పారాలింపిక్స్‌కు దూరంకానున్నాడు.
”ప్రమోద్ భగత్‌ను 12 నెలల వ్యవధిలో మూడుసార్లు డోపింగ్ పరీక్ష కోసం రమ్మని కోరాం. అయినా అతడు హాజరుకాలేదు. అంతేకాదు రాలేకపోవడానికి గల కారణాలను వెల్లడించడంలో విఫలమయ్యాడు. నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (CAS) డోపింగ్ నిరోధక విభాగం మార్చి 1, 2024న అతడిని సస్పెండ్ చేసింది. తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రమోద్ కాస్‌ను అభ్యర్థించాడు. దీనిని 29 జూలై 2024న కాస్ కొట్టివేసింది. మార్చి 1న డోపింగ్ నిరోధక విభాగం ఇచ్చిన తీర్పును సమర్థించింది” అని బీడబ్ల్యూఎఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రమోద్ భగత్ టోక్యో పారాలింపిక్స్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 కేటగిరీలో పోటీ పడ్డాడు. ఫైనల్లో డేనియల్ బెథెల్ (బ్రిటన్)ను ఓడించి స్వర్ణం పతకాన్ని గెలుచుకున్నాడు.
Dope Test – పారా ఒలింపియన్ ప్రమోద్ భగత్ పై సస్పెన్షన్ వేటు..
- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement