Sunday, October 6, 2024

TG | ఆందోళన వద్దు.. ఇదే చివ‌రి డీఎస్సీ కాదు : డిప్యూటీ సీఎం భట్టి

డీఎస్సీపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ యువతీ యువకులు ఆందోళన చెందవద్దని ఇదే చివరి డీఎస్సీ కాదని సూచించారు. మరో డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, 5 నుంచి 6వేల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. డీఎస్సీ వాయిదా వేస్తే పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది…. త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని తెలిపారు.

విద్యావ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్య అందించాలని డీఎస్సీ ప్రకటించాం అని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసిందని.. పదేళ్లు అధికారంలో ఉన్నా గత ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించలేదు. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్ల కోసం తాపత్రయపడ్డారు అని అన్నారు.

మా ప్రభుత్వం రాగానే 11వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం.. 16వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించి 19,718 మంది టీచర్లు ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాం అని తెలిపారు. ఇక‌ ఇప్పటికే 2 లక్షల 500మందికి పైగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని…. మొత్తం 2 లక్షల 79 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్ల‌డించారు.

ఇక‌ డీఎస్సీ పోస్ట్ పోన్ చేయమని కొంతమంది ధర్నాలు చేస్తున్నారు. మా ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువకులు నష్టపోయిన విషయాన్ని గుర్తించాం అని తెలిపారు. గ్రూప్ 2 కూడా గత ప్రభుత్వం మూడు సార్లు పోస్ట్ పోన్ చేసిందని…. గ్రూప్ 3 కూడా నిర్వహించలేకపోతే మళ్ళీ మేం షెడ్యూల్ చేశాం అని పేర్కోన్నారు.

ఇవి కాక వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 13,321 పోస్టులను టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నాం. డీఎస్సీని కూడా పకడ్బందీగా నిర్వహిస్తాం. మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కోరుతున్నాం అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement