Tuesday, November 19, 2024

అన్నం మిగిలిందా? ఈ నంబరుకు కాల్ చేయండి

హైదరాబాద్: అన్నం మిగిలితే పారివేయద్దని, ఫోన్‌ చేస్తే డోంట్‌ వేస్ట్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు వచ్చి తీసుకెళ్లి పేదల ఆకలి తీర్చుతారని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. అందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని కమిషనరేట్‌లో డీసీపీ విజయ్‌కుమార్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలాచోట్ల పేదలు, ముఖ్యంగా పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి ఆస్పత్రుల్లో చేరిన పేషంట్ల అటెండెంట్‌లు అర్ధాకలితో బాధపడుతున్నారని తెలిపారు.

ఆకలితో బాధపడేవారికి అన్నం అందించడానికి డోంట్‌ వేస్ట్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌ సంస్థవారు ముందుకు వచ్చారన్నారు. ఎవరైనా అన్నం మిగిలితే 7207103539 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వారు వచ్చి భోజనం తీసుకెళ్లి పేదలకు పంపిణీ చేస్తారన్నారు. ప్రస్తుతం వారు రోజుకు రెండువేల మంది ఆకలి తీరుస్తున్నారని తెలిపారు. ఇంత గొప్ప బాధ్యత తీసుకున్న డోంట్‌ వేస్ట్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌ సంస్థ ప్రతినిధులు చక్రధర్‌గౌడ్‌, మల్లేశ్వరరావు, స్కైలాబ్‌ సీఈవో శిరీష్‌వర్మ, విష్ణు, అన్వేష్‌లను సీపీ సజ్జనార్‌ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement