షిరిడి, (ప్రభన్యూస్) : దేవాలయాల నిర్మాణ నిర్ణయాన్ని సాయి సంస్థాన్ ఉపసంహరించుకోకుంటే అక్టోబర్ 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని షిరిడీ మాజీ మేయర్, సాయి సంస్థాన్ మాజీ అధ్యక్షురాలు అనిత జగ్తాప్ అన్నారు. సాయిబాబా సంస్థాన్ దేశవ్యాప్తంగా సాయి మందిరాలను నిర్మించాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.
షిర్డీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షురాలు అనితా జగ్తాప్, ఉపాధ్యక్షుడు విజయ్ జగ్తాప్ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. సాయి సంస్థాన్‌కు ఐదు ఎకరాల భూమిని ఇస్తే, 50 లక్షలతో అక్కడ షిర్డీ వంటి ఆలయాన్ని నిర్మించాలని ఈవో నిర్ణయం తీసుకోవడం ఏమిటని అన్నారు. షిరిడీ ఆలయ నిధులతో అన్నదానం, హాస్పిటల్స్ వంటి కార్యకలాపాలను నిర్వహించాలని సూచించారు.