Tuesday, November 26, 2024

ఢిల్లీ లడ్డు తినొద్దు, డార్జిలింగ్‌ హిల్‌ పార్టీల నేతలకు మమత హితవు

డార్జిలింగ్‌ హిల్‌ పార్టీల ప్రతినిధులతో భేటీ సందర్భంగా మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండప్రాంత ప్రజల శ్రేయస్సుకు పనిచేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఢిల్లీ లడ్డూను తినవద్దని నేతలకు సూచించారు. సోమవారం తాను డార్జిలింగ్‌కు చెందిన నాలుగు రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపానని.. ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు. పర్వత ప్రాంత ప్రజల కోసం మనం పనిచేయాలని, డార్జిలింగ్‌ మురిసేలా కలిసికట్టుగా పనిచేద్దామని ఆమె పిలుపు ఇస్తూ ఢిల్లీ లడ్డూను తినవద్దని నేతలకు సూచించారు.

ధరల పెంపు నుంచి ప్రజలను మళ్లించేందుకు కేంద్ర పాలకులు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రత్యర్ధులపై ఉసిగొల్పుతారంటూ మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాషాయ పార్టీ నేతలు దేశాన్ని కాపాడేవారిగా నమ్మబలుకుతారని అయితే ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని చెప్పారు. ఇక డార్జిలింగ్‌ ప్రాంతానికి శాశ్వత రాజకీయ పరిష్కారం చూపాలని గూర్ఖా జన్‌ముక్తి మోర్చా (జీజేఎం) కోరింది. ఉత్తర బెంగాల్‌లో ఐదు రోజుల పర్యటనకు వచ్చిన మమతా బెనర్జీని సోమవారం జీజేఎం ప్రతినిధి బృందం కలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement