Tuesday, November 19, 2024

నిందితుల అరెస్టులో లేట్​ చేయొద్దు.. క్రమశిక్షణ చర్యలుంటాయన్న సీపీ రంగనాథ్​

నమోదైన కేసుల్లో నేరానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయడంలో అధికారులు జాప్యం చేయద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. పెండింగ్ కేసులపై ఇవ్వాల (శుక్రవారం) పత్యేక సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంగనాథ్​ మాట్లాడారు. పెండింగ్​ కేసుల్లోని నిందితులు త్వరితగతిన అరెస్టు చేయాలన్నారు. నిందితుల అరెస్టు విషయంలో సమస్య వుంటే తన దృష్టికి తీసుకరావాలన్నారు. కేసు నమోదు అయిన నెల రోజుల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేయాల్సి వుంటుందని, లేకుంటే క్రమ శిక్షణ చర్యలు తప్పవని చెప్పారు. ఈ సమీక్షలో డిసిపిలు, ఏసిపిలు, ఇన్​స్పెక్టర్లు, సబ్-ఇన్​స్పెక్టర్లు హాజరయ్యారు.

సాధరణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీస్ కమిషనర్ ఎక్సైజ్ పోలీసులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు విభాగాల అధికారులు గత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరంలో నమోదు చేసిన కేసులను సమీక్ష జరిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుడంబా విక్రయాలతో పాటు, తయారీ అలాగే అక్రమ మద్యం నియంత్రణపై స్థానిక పోలీసులు ఏక్సైజ్ పోలీస్ విభాగం సంయుక్తంగా కల్సి పనిచేయాల్సి వుంటుందని, అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడే వ్యక్తులను బైండోవర్లు చేయడంతో పాటు, కేసులను నమోదు చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, డిసిపిలు కరుణాకర్, అబ్దుల్ బారి, సీతారాం,పుష్పాతో పాటు పోలీస్, ఎక్సైజ్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement