Saturday, November 23, 2024

డిస్టెన్స్‌ సర్టిఫికెట్లపై గందరగోళం తగదు: టిప్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో నెంబర్‌ 16ను జారీ చేసి, ప్రస్తుతం ఆ ప్రక్రియను వేగవంతం చేస్తున్న దశలో కొన్ని యూనివర్సిటీల్లో దూరవిద్య ద్వారా చదివిన సర్టిఫికెట్‌లపై గందరగోళం సృష్టిస్తున్నారని తెలంగాణ ఇంటర్‌ విద్య పరిరక్షణ సమితి (టిప్స్‌) రాష్ట్ర కన్వీనర్లు మాచర్ల రామకృష్ణ గౌడ్‌, డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌ తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని బోజ్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి 1996 నుంచి 2014-15 వరకు గుర్తింపు ఉన్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉన్నదని, అధ్యాపకులు ఆందోళన చెందొద్దని వారు మంగళవారం వారు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement