Tuesday, November 26, 2024

టెన్త్‌ షెడ్యల్‌ మార్చొద్దు.. తెలంగాణ పౌరస్పందన వేదిక అభిప్రాయ సేకరణ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ను మార్చొద్దని విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎండల నేపథ్యంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు, పేరెంట్స్‌ నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై తెలంగాణ పౌరస్పందన వేదిక విద్యార్థుల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ రూపంలో సీక్రెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను చేపట్టింది. ఈ ఓటింగ్‌లో మొత్తం హైదరాబాద్‌ జిల్లా నుంచి 23 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

ఓటింగ్‌లో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 1392 కాగా, వాటిలో చెల్లని ఓట్లు 14 ఉన్నాయి. చెల్లిన ఓట్లు 1378. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 23 నుండి పదో తరగతి పరీక్షలు ఉండాలని 909 (66శాతం) మంది విద్యార్థులు ఓటు వేయగా, ఏప్రిల్‌ 25 నుంచి పరీక్షలు ఉండాలని 469 (34శాతం) మంది విద్యార్థులు ఓటు వేశారు. నగరంలోని 23 పాఠశాలలకు వెళ్లి ఈ ప్రక్రియను చేపట్టినట్లు పౌరస్పందన వేదిక హైదరాబాద్‌ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే పదో తరగతి షెడ్యూల్‌ను మార్చాలని విద్యాశాఖ మంత్రిని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరగా సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సంఘాల నేతలతో మంత్రి చెప్పినట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement