వేములవాడ సబ్ డివిజన్లోని ప్రజలు నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని డిఎస్పి నాగేంద్ర చారి సూచించారు. గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో కొంతమంది పాస్పోర్ట్ ఏజెంట్లు నకిలీ పదవ తరగతి సర్టిఫికెట్లను తయారుచేసి అమాయక ప్రజల దగ్గర సొమ్ము చేసుకుంటున్నారని వెల్లడించారు. సుమారు పదిమంది వ్యక్తులకు నకిలీ పదవ తరగతి మెమోలను సృష్టించి వారికి పాస్పోర్ట్ లు ఇప్పించారన్నారు. నకిలీ ఏజెంట్ల వద్దకు వెళ్లి పాస్పోర్ట్ లు పొందిన వారు సైతం చట్టం దృష్టి లో నిందితులుగా మారతారని అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ కేంద్రాలలోనే ప్రజలు పాస్పోర్ట్ పొందాలని సూచించారు. పదిమంది నిందితులలో ఆరుగురిని బుధవారం గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. మరి కొంతమంది పరారీలో ఉన్నట్లు వారిని త్వరలో పట్టుకొని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. కార్యక్రమంలో సిఐ వెంకటేష్,ఎస్సై వెంకటరాజం,సిబ్బంది పాల్గొన్నారు. నిందితుల వద్ద నుండి కంప్యూటర్, ల్యాప్టాప్, సెల్ ఫోన్లు, నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.