అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత హుషారుగా ఉంటారో అందరికి తెలిసిందే..అధికారంలో ఉన్నప్పుడు తన కాంమెంట్స్ తో అందరిని ఆశ్చర్యపరిచేవాడు ట్రంప్..అప్పుడ, ఇప్పుడు, ఎప్పుడు జోష్ లోనే ఉంటారు ట్రంప్. తాజా గా ట్రంప్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగోలో జరిగిన ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులను అభినందిస్తూ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుషారుగా మాట్లాడారు. అంతేకాదు పనిలో పనిగా బైడెన్ పై విమర్శలు గుప్పించారు.
ట్రంప్ ఈ వేడుకలో మాట్లాడుతూ నన్ను మరచిపోలేకపోతున్నారా? అని ఆహ్వానితులను ప్రశ్నించారు. తన స్నేహితులు మేగన్ నోడిరర్, జాన్ అరిగోలతో కలసి ఈ విందులో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతుంటే, అతిథుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యూఎస్, మెక్సికో సరిహద్దుల విషయాన్ని ప్రస్తావించిన ఆయన, చైనా, ఇరాన్ తదితర దేశాలతో అమెరికా వైఖరిని సైతం తప్పుబట్టారు. “ఈ చిన్నారుల పరిస్థితి ఏంటి? గతంలో ఎవరూ అంత దుర్భరంగా తమ బాల్యాన్ని గడపలేదు” అని సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఆయన ప్రశ్నించారు. బైడెన్ బాధ్యతలు తీసుకున్న తరువాత వలసవాదుల సంఖ్య పెరిగిపోయిందని, అనాధ బాలలు అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించారు.