దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం 3 తరువాత ఒక్కసారిగా కుప్పకూలాయి. దీనికి కారణం.. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు. కొన్ని దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం కూడా నష్టాలకు ప్రధాన కారణం. ఉదయం 57,632.94 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో గరిష్టంగా 57,733.37 పాయింట్లకు, కనిష్టంగా 57,109.24 పాయింట్లను తాకింది. చివరికి 68.62పాయింట్లు నష్టపోయి 57,232.06 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ సూచీ కూడా ఉదయం పాజిటివ్‌గానే ప్రారంభమైంది. 17,194.50 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో 17,220.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,027.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 28.95 పాయింట్లు నష్టపోయి.. 17,063.25 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.54 వద్ద ఉంది.
లాభాల్లోకి 27 షేర్లు..
నిఫ్టీ 50 సూచీలో 23 షేర్లు లాభపడగా.. 27 షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 30లో కొటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, ఇండస్‌ఇండ్ బ్యాంకు, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. రియాల్టి ఇండెక్స్ 3 శాతం పుంజుకుంది. ఆటో, ఐటీ రంగం షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనై.. చాలా వరకు నష్టాలు నమోదు చేశాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న.. సూచీలు 3 గంటల వరకు లాభాల్లోనే కదలాడాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై ఎలాంటి సంకేతాలు రాలేదు. పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అన్న భయంతో.. ఇన్వెస్టర్లు చివరి అర గంటలో అమ్మకాల వైపు పరుగులు పెట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..