భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 83శాతం పెరగొచ్చని అంచనా. కాగా గత ఆర్థిక సంవత్సరం రూ.42వేల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు జరిగాయి. కరోనా సంక్షోభం, మైక్రోచిప్‌ల కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు భారీగా తగ్గాయి. చిప్‌ల కొరత సమస్య ఇంకా కొనసాగుతోంది. గడిచిన నాలుగేళ్లలో దేశీయ దేశీయ స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 32శాతం పెరిగాయి. 2017-18లో స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల విలువ రూ.1300కోట్లుగా ఉన్నట్లు తేలింది. కేవలం నాలుగేళ్లలో ఈ విలువ రూ.42,000లకు చేరడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో రూ.42వేల కోట్ల ఎగుమతులు నమోదవగా అందులో రూ.20వేల కోట్ల విలువైన ఎగుమతులు కేవలం శాంసంగ్ ఫోన్లకు, రూ.12వేల కోట్ల విలువైన ఎగుమతులు యాపిల్ ఐఫోన్లకు సంబంధించినవే కావడం గమనార్హం.
కరోనా విషయంలో చైనాపై వచ్చిన వ్యతిరేకత, భారత్ చైనా మధ్య జరిగిన గల్వాన్ ఘటన తర్వాత దేశీయంగా భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు, తయారీ ఆధారిత ప్రోత్సాహకాలు ప్రకటించడం వంటి చర్యలతో భారత్‌లో ఉత్పత్తి భారీగా పెరిగింది. భారత్‌లో ఉత్పత్తయిన వివిధ కంపెనీల ఫోన్లకు దక్షిణాసియా, ఐరోపాల నుంచి డిమాండ్ పెరిగిందని ఇండియన్ సెల్యులార్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) నివేదిక తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...