Monday, November 18, 2024

డొమెస్టిక్‌ సిలెండర్ల .. సబ్సిడీకి మంగళం

న్యూఢిల్లి : కేంద్రప్రభుత్వం సామాన్యులకు షాకిచ్చే మరో కొత్త నిర్ణయం తీసుకుంది. కేంద్రప్రభుత్వం డొమెస్టిక్‌ సిలెండర్లు (ఎల్పీజీ)పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తి వేసింది. ఆ సబ్సిడీని కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు మాత్రమే పరిమితం చేసింది. సాధారణ ప్రజానీకం ఇకపై వంటగ్యాస్‌ సిలెండర్‌ను మార్కెట్‌ రేటుకు కొనాల్సి ఉంటుందని ఆయిల్‌ సెక్రటరీ పంకజ్‌ జైన్‌ గురువారం మీడియాకు వెల్లడించారు.

కొవిడ్‌ నుంచి ఎల్పీజీ సిలెండర్లపై కేంద్రం సబ్సిడీని ఇవ్వడం లేదని, ఇకపై దానినే కొనసాగించనుందని ఆయన ప్రకటించారు. కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయంతో 21 కోట్ల మందిపై అదనపు భారం పడనుంది. 9 కోట్ల మందికి సిలెండర్‌పై రూ.200ల సబ్సిడీ లభించనుంది. సబ్సిడీ సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. దేశవ్యాప్తంగా 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement