Tuesday, November 26, 2024

దేశీయ విమానయాన రంగం.. భవిష్యత్​పై ఆశలు, భారీ విస్తరణ ప్రణాళికలు

మన దేశ విమానయ రంగం కొవిడ్‌ తరువాత 2022 రెండో అర్ధ భాగం నుంచి క్రమంగా కొలుకుటోంది. కొవిడ్‌ ముందు నాటి పరిస్థితిలు ఇంకా ఏర్పడలేదు. ఇటీవల మళ్లి కొవిడ్‌ విజృభింస్తుందన్న వార్తల నేపథ్యంలో 2023లో మళ్లి పాత రోజుల పరిస్థితి వస్తుందా అన్న ఈ రంగంలో నెలకొంది. కొవిడ్‌తో పాటు, రష్యా, ఉక్రెయిన్‌ సంక్షోభం ఇంకా కొనసాగుతుండం వంటి ప్రతికూల పరిస్థితులు విమానయాన రంగాన్ని భయపెడుతున్నాయి.

విస్తరణ ప్రణాళికలు

ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్‌ భారీగా విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. పెద్ద సంఖ్యలో కొత్త విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఎయిర్‌ ఇండియా రానున్న రెండు సంవత్సరాల్లో 500కు పైగా విమానాలను కొనుగోలు చేయనుంది. జాతీయ రూట్స్‌తో పాటు, పలు అంతర్జాతీయ రూట్స్‌లోనూ ఎయిర్‌ ఇండియా కొత్త సర్వీస్‌లు నడపాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన విమానాల కొనుగోలు చేసేందుకు ఆర్డర్‌ ఇచ్చింది. విమానయాన రంగంలో ఇదే అతి పెద్ద ఆర్డర్‌గా నిలిచింది.

- Advertisement -

మరో సంస్థ ఇండిగో కూడా వైడ్‌ బాడీ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ సైతం భవిష్యత్‌ ప్రణాళికలు ప్రకటించింది. విమానయాన సంస్థలకు లాభదాయకత ముఖ్యం. గత కొన్ని వారాలుగా దేశీయంగా రోజువారి ప్రయాణికుల సంఖ్య నాలుగు లక్షలకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సప్లయ్‌ చైన్‌లో ఇబ్బందుల మూలంగా విమానాల తయారీలో కావాల్సిన కంపోనెంట్స్‌ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీని వల్ల ఎయిర్‌క్రాఫ్ట్‌లను సకాలంలో అందించలేని పరిస్థితి ఏర్పడిందని కంపెనీలు చెబుతున్నాయి. 2022లో దేశీయ విమాయన రంగంలో అనేక కీలక మార్పులు జరిగాయి. నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండియాను టాటా గ్రూప్‌ కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం కొత్తగా ఆకాష్‌ ఎయిర్‌ తన కార్యకాలాపలు ప్రారంభించంది. జట్‌ ఎయిర్‌ వేస్‌ భవిష్యత్‌ ప్రణాళికలు ప్రకటించినప్పటికీ, ఇంకా అనిశ్చితి మాత్రం తొలగిపోలేదు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌(ఇసీఎల్‌జీఎస్‌) కింద ప్రభుత్వం స్పైస్‌ జెట్‌, గో ఫస్ట్‌ విమానయాన సంస్థలకు ఆర్ధిక సహాయం అందించింది. దేశీయ విమానయాన రంగం ప్రయాణీకుల పరంగానూ, విమాన సంఖ్య పరంగానూ అభివృద్ధి చెందుతున్నది. మరో వైపు కొత్త విమానాశ్రయాల సంఖ్య కూడా పెరుగుతున్నది. 2022లో కొత్తగా గోవా ఇంటర్నెషనల్‌ ఎయిర్‌ పోర్టు, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఒక కొత్త ఎయిర్‌ పోర్టు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో 146 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. రానున్న సంవత్సరాల్లో విమనాశ్రాయల సంఖ్యను 200కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశ విమానయాన రంగం బలమైన వృద్ధిని సాధిస్తుందన్న నమ్మకం ఉందని ఇటివలే పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అభిప్రాయపడ్డారు.

ఈ రంగం వి షేప్‌ రికవరీ చాలా స్ట్రాంగ్‌గా ఉందన్నారు. ఈ వృద్ధి కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొవిడ్‌ మూలంగా రెండు సంవత్సరాల పాటు ఇంటర్నేషనల్‌ విమాన సర్వీసులు నడవలేదు. 2022 మార్చిలో మొదటిసారి ఈ సర్వీసులను పునరుద్ధరించారు. 2023లో ప్రారంభంలోనే మళ్లి కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయన్న వార్తలతో అంతర్జాతీయంగానూ ఆందోళన నెలకొంది. ఈ ఏ రూపం తీసుకుంటుందో ఇప్పుడే చెప్పలేమని ఈ రంగంలోని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

విలీనాలు

ఈ సారి దేశీయ విమానయాన రంగాన్ని ముందుకు నడిపించడంలో ఎయిర్‌ఇండియా ప్రధాన భూమిక పోషిస్తున్నది. టాటా గ్రూప్‌ కొనుగోలు చేసిన తరువాత ఎయిర్‌ ఇండియా భారీ ఎత్తున విస్తరణ ప్రణాళీకలు చేపట్టింది. ఎయిర్‌ ఏషియాను విలీనం చేసుకుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను, విస్తారా ఎయిర్స్‌లైన్స్‌ కూడా ఎయిర్‌ ఇండియాలో విలీనం అయ్యాయి. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు విస్తారా ఎయిర్‌ లైన్స్‌లో 49 శాతం వాటా ఉంది. దీన్ని ఎయిర్‌ ఇండియాలో విలీనం చేసేందుకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. విలీనం తరువాత ఎయిర్‌ ఇండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా లభిస్తుంది. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విలీనం వల్ల , అతి పెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగోకు గట్టి పోటీదారుగా అవతరించింది.

స్పైస్‌ జెట్‌ ఇబ్బందులు

2022వ సంవత్సరం స్పైస్‌ జెట్‌కు కష్టకాలంగానే పరిగణించాలి. ఈ సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంది. భద్రత పరమైన లోపాల మూలంగా డైరెక్టర్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ కఠిన ఆంక్షలు విధించింది. సగం విమాన సర్వీస్‌లపై నిషేధం విధించింది. దీనికి తోడు ఆర్ధిక సమస్యలు ఈ సంస్థను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌ లీజింగ్‌ సమస్యల్లోనూ చిక్కుకుంది. కొన్ని విమానాలను లీజ్‌కు ఇచ్చిన సంస్థలు వెనక్కి తీసుకున్నాయి. 2023లో సమస్యలను అధిగమించేందుకు నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయత్నాలు ఎంత మేర ఫలిస్తాయో చూడాల్సి ఉంది. ఇక కొత్త సంవత్సరంలో కార్గో బిజినెస్‌ను వేరు చేయాలని కూడా భావిస్తోంది. ఈసీఎల్‌జీఎస్‌ స్కీమ్‌ కింద నిధులు పొందుతున్న వాడియా గ్రూప్‌కు చెందిన గో ఫస్ట్‌ సంస్థ నిధులను సమీకరించాలని భావిస్తోంది. తాజా పరిణామాల నేపధ్యంలో ఈ సంస్థ ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి. స్పైస్‌ జెట్‌, గో ఫస్ట్‌ సంస్థలు రెండు ఎయిర్‌ ఇండియా, అక్షర ఎయిర్‌లైన్స్‌ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నాయి.

ఇక జెట్‌ ఎయిర్‌వేస్‌ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2022లోనే కార్యకలాపాలు ప్రారంభించాల్సిన జెట్‌ ఎయిర్‌ రుణదాతలు, విన్నింగ్‌ బిడ్డర్‌ జలాన్‌ కల్రాన్‌ కన్సార్టియం మధ్య విబేధాలతో నిలిచిపోయాయి. 2019 నుంచి జట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 2023లో విబేధాలు పరిష్కారమైతే ఈ సంస్థ సర్వీస్‌లను ప్రారంభించే అవకాశం ఉంది. 2022లో చివరిలో ఢిల్లిd ఎయిర్‌పోర్టులో విపరీతమైన ప్రయాణీల రద్దీ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కొవిడ్‌కు ముందు పరిస్థితులు వచ్చాయని భావించారు. మరో వైపు ప్రభుత్వం విమానశ్రాయాలను ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది. మరో వైపు భద్రత విషయంలో మన విమాన రంగం మెరుగైన ర్యాంక్‌ను సాధించింది. ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఏఓ) ఇచ్చే ఈ భద్రత పరమైన ర్యాంకింగ్స్‌లో 2018లో మన దేశం స్థానం 102లో ఉంటే, 2022లో 48వ స్థానానికి చేరుకున్నాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement