Friday, November 22, 2024

డొమెస్టిక్‌ ఎయిర్‌ ప్యాసింజర్‌, 59 శాతం వృద్ధి.. 84 మిలియన్‌లకు ట్రాఫిక్‌

భారతీయ డొమెస్టిక్‌ ఎయిర్‌ ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ పరంగా 59 శాతం పెరిగి.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 84 మిలియన్‌లకు చేరుకుందని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. అయితే ఇది మహమ్మారికి ముందు ఉన్న స్థాయితో పోలిస్తే.. ఇప్పటికీ 40 శాతం తక్కువగా ఉందని తెలిపింది. సోమవారం ఎలివేటెడ్‌ ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధరలు, భౌగోళిక-రాజకీయ సమస్యల కారణంగా తీవ్రతరం అయ్యాయి. పరిశ్రమకు సమీపకాల సవాల్‌గా మిగిలిపోతుందని, ఈ రంగానికి లాభదాయకత కీలక నిర్ణయాధికారిగా ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. సీక్వెన్షియల్‌ ప్రాపతిదికన.. దేశీయ ప్రయాణీకుల రద్దీ మార్చిలో 37 శాతం పెరిగి.. 10.6 మిలియన్‌లకు చేరుకుంది.

మహమ్మారి ప్రభావం క్షీణించడంతో విమానయాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని ఇక్రా తెలిపింది. ఫిబ్రవరి 2022లో స్థానిక విమానా మార్గాల్లో ప్రయాణీకుల రద్దీ 7.7 మిలియన్‌లుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో ట్రాఫిక్‌ వృద్ధి 35 శాతంగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే.. ఇది 7.8 మిలియన్‌లకు పైగా ఉందని పేర్కొంది. మార్చి 2022లో ఎయిర్‌లైన్స్‌ కెపాసిటీ విస్తరణ 12 శాతం వృద్ధితో.. 80,217 డిపార్చర్‌లను నమోదు చేసింది. గతడాది ఇదే నెలలో 71,548 డిపార్చర్‌లకు పైగా చేరిందని ఇక్రా తెలిపింది. డొమెస్టిక్‌ డిపార్చర్‌లు గత నెలతో పోలిస్తే.. ఈ ఏడాది మార్చిలో 42 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement