Monday, November 18, 2024

ట్విట్టర్‌కు పనిచేయను : డోర్సే

ట్విట్టర్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశంపై ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లోఎప్పుడూ ఆ సంస్థకు సీఈవోగా పనిచేయబోనని తేల్చిచెప్పారు. ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, డోర్సే మళ్లిd సీఈవోగా పనిచేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై డోర్సేను ప్రశ్నించగా, అలాంటి ప్రసక్తే ఉత్పన్నం కాదని స్పష్టంచేశారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించిన మొదట్లో డోర్సే ఆయనకు మద్దతు పలికారు. ఆ తర్వాత మస్క్‌ సంచలన నిర్ణయాలతో బహిరంగ విమర్శలు చేశారు.

ఉద్యోగాల కోత, ఫీచర్ల పేర్లు మార్పు వంటి అంశాలను ఆయన వ్యతిరేకించారు. 16 ఏళ్ల కిందట సహ వ్యవస్థాపకుడిగా ట్విట్టర్‌ను ప్రారంభించిన డోర్సే, గతేడాది నవంబర్‌లో సీఈవో బాధ్యతల నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఎందుకు వైదొలగారన్న దానికి ఆయన ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఇండియాకు చెందిన పరాగ్‌ అగర్వాల్‌ సీఈవోగా నియమితులయ్యారు. మస్క్‌ యాజమాన్యం ప్రారంభం కాగానే అగర్వాల్‌కు ఉద్వాసన పలికారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement