Friday, November 22, 2024

హైకోర్టు అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించదా ?

కరోనా వేళ ముగ్గురు జిల్లా కలెక్టర్లను దేవర యంజాల్ భూముల విచారణకు ఉపయోగించడాన్ని హై కోర్ట్ తప్పు పట్టిందన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిరంజన్. హైకోర్ట్ అభిప్రాయాన్ని కూడా లెక్క చేయకుండా నిన్న తిరిగి దేవర యంజాల్ భూముల పై విచారణకు పంచాయత్ రాజ్ శాఖ కమీషనర్ రఘునందన్ రావు మరియు జిల్లా కలెక్టర్లు, శ్వేతా మహంతి మరియు భారతి హోళీకేరీ వెళ్లారన్నారు.
గౌరవ హైకోర్ట్ అభిప్రాయాలకు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చే గౌరవానికి ఇదే నిదర్శనమన్నారు నిరంజన్.

గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఈ పరిస్థితులను గమనించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలన్నారు. కోవిద్ విజృంబిస్తున్న వేళ తమ జిల్లాలో ఉండి కట్టడి చేయాల్సిన ముగ్గురు జిల్లా కలెక్టర్లను దేవర యంజాల్ భూముల విచారణ కమిటీ లో వేసి విచారణ చేయించడము పట్ల ఈ నెల 8 న హైకౌర్ట్ ఆశ్చర్యాన్ని ,విస్మయాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిందన్నారు. అయినా హైకౌర్ట్ అభిప్రాయాన్ని లెక్క చేయకుండా , పంచాయత్ రాజ్ శాఖ కమీషనర్ రఘునందన్ రావు మరియు జిల్లా కలెక్టర్లు, శ్వేతా మహంతి మరియు భారతి హోళీకేరీ, నిన్న దేవర యంజాల భూముల విచారణకు వెళ్లడము దురదృష్టకరమని విమర్శించారు నిరంజన్. హైకోర్ట్ అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించదా ? ఆదేశాలిస్తేనే పాటిస్తుందా అని ప్రశ్నించారు.
గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ప్రభుత్వ ధోరణిని గమనించి కట్టడి చేయాలని కోరారు నిరంజన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement