బొప్పాయి ఆరోగ్యప్రధాయిని అంటూ గుండెజబ్బులు క్యాన్సర్ వ్యాధులను అరికట్టడానికి దోహదపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి పండ్లలో విటమిన్ ఏ,సి కలిగి ఉన్నందున యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. కన్నులకు మేలు చేస్తుందని శుక్లాలు రాకుండా దోహదపడుతుంది. పండ్లలో పోటాషియం కలిగి ఉన్నందున గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. జీర్ణక్రియ పెరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ మలబద్దకం తగ్గుతాయి. క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టడానికి దోహదపడుతుంది.
ఇందులో మెగ్నీషియం, పోటాషియం కలిగి ఉన్నందున జోనా కేరాటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. డెంగ్యూ వాధి ప్రబలిన వారు బొప్పాయి వైపు దృష్టి సారించారు. తెల్ల రక్తకణాలను పెంపొందించడంలో బొప్పాయి ఎక్కువగా దోహదపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పొలం గట్లపై ఇంటి పరిసరాల్లో బాత్‌రూమ్‌ల సమీపంలో బొప్పాయి చెట్లను ఎక్కువగా పెంచుతున్నారు. గ్రామీణీలకు పంపిణీ చేస్తున్నారు. డెంగ్యూ వ్యాధి విజృంభించిన సమయంలో ఎక్కువ ధరకు మార్కెట్లో ఖరీదు చేశారు. దీంతో నేడు చాలా మంది ఇంటి పరిసరాల్లో బొప్పాయి మొక్కలు పెంచుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.