దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తాండవిస్తోంది. దీనికితోడు ఇప్పుడు దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పంజాబ్‌కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ కెకె తల్వార్ మాట్లాడుతూ కరోనా ఫస్ట్ వేవ్‌లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు కనిపించాయన్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్‌లో ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగిందన్నారు. ఒక్క పంజాబ్‌లోనే ఇప్పటివరకు 158 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. వైద్యులు స్టెరాయిడ్లను అధికంగా వినియోగిస్తున్నందున సెకెండ్ వేవ్‌లో బ్లాక్ ఫంగస్ వ్యాప్తి అధికంగా ఉందన్నారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్‌లోనూ గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు కనిపించాయన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement