Thursday, November 21, 2024

లివర్, గాల్ బ్లాడర్ నుంచి 1000 రాళ్ల తొలగించిన వైద్యులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాలేయం, పిత్తాశయం, పిత్త వాహిక నుంచి 1000కి పైగా రాళ్లను తొలగించిన ఓ రోగి ప్రాణాలను మాదాపూర్‌ మెడికవర్‌ వైద్యులు కాపాడారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ రోగి మూడు సంవత్సరాలుగా కడుపునొప్పి, కామెర్లతో తరచుగా ఇబ్బంది పడేవాడు. అతన్ని పరీక్షించిన డాక్టర్స్‌ అతినికి వేరుశనగ పరిమాణం నుంచి నిమ్మకాయ వరకు వివిధ పరిమాణంలో ఉన్న బహుళ పిత్తాశయం, పిత్త వాహిక రాళ్లు ఉన్నాయని గుర్తించారు. దీంతో పిత్త వాహిక వ్యవస్థకు వాపు వచ్చి మరింత ఇబ్బంది పడ్డాడు.

పశ్చిమబెంగాల్‌ నుంచి మెడికవర్‌ ఆస్పత్రికి వచ్చిన రోగిని లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ అండ్‌ హెపాటో ప్యాంక్రియాటో బిలియరీ సర్జన్‌ డాక్టర్‌ కిషోర్‌రెడ్డి రోగిని పరిశీక్షించి శస్త్రచికిత్స చేసి రాళ్లను తొలగించాలని నిర్ణయించారు. రోగి కోలిసిస్టెక్టమీ (పిత్తాశయం తొలగింపు) చేసి ప్రధాన పిత్త వాహిక తెరిచి 250గ్రాముల 1000 రాళ్లను తొలగించారు.

- Advertisement -

ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కాలేయం ద్వారా విసర్జించే కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి పిత్తంలో తగినంత రసాయనాలు ఉంటాయని, కానీ కాలేయం పిత్తం కరిగిపోయే దానికంటే ఎక్కువ కొలెస్ట్రాల్‌ను విసర్జిస్తే, అదనపు కొలెస్ట్రాల్‌ స్ఫటికాలుగా మారి చివరకు రాళ్లు ఏర్పడుతాయన్నారు.

పిత్త వాహికలో రాయి చిక్కుకున్నపుడు, వైద్యుడిని కలవడం అవసరమని, లేకపోతే వాపు, బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌, తీవ్రమైన అవయవ నష్టం కూడా జరగొచ్చని అన్నారు. రోగి, అతి కుటుంబ సభ్యులు డాక్టర్‌ కిషోర్‌రెడ్డికి, అని బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement