భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇంటిని ఓ డాక్టర్ దంపతులు సొంతం చేసుకున్నారు. కోవింద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ఉండడంతో బిహార్‌లోని తన నివాసాన్ని డాక్టర్ దంపతులకు విక్రయించారు. డాక్టర్ బాలా, డాక్టర్ శరద్ కతియార్ ఇప్పుడు బీహార్‌లోని కళ్యాణ్‌పూర్ M బ్లాక్‌లోని మాజీ రాష్ట్రపతి నివాసానికి సొంత హక్కుదారులయ్యారు. శరద్, బాలా బిల్హౌర్‌లో శ్రీష్ నర్సింగ్ హోమ్ నడుపుతున్నారు. వారు ప్రస్తుతం కన్హ శ్యామ్‌లో నివసిస్తున్నారు.
ఇక.. రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన కానీ, ఆయన సతీమణి సవిత కానీ అప్పుడప్పుడూ ఈ బంగ్లాను సందర్శించేవారు. ప్రోటోకాల్ ప్రకారం ఆ ఇంటికి ఒక పోలీసు కంపెనీ కాపలాగా ఉంది. దాని కారణంగా ఆ ప్రాంతం VIP హోదాను పొందింది. కాగా, కోవింద్ బంగ్లా ఇక్కడ దయానంద్ బీహార్ మునిసిపల్ బాడీగా ఉన్నందున ఈ ప్రాంతం కొంత ప్రజాదరణ పొందింది. బల్బీర్ సింగ్ నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అందంగా.. మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దడానికి విద్యుత్, అటవీ శాఖ అన్ని ప్రయత్నాలు చేసింది.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ ఇంట్లో బస చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు డాక్టర్ శరద్ కతియార్ చెప్పారు. తాను ఢిల్లీలో రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశానని, ఆయన సరళత, సౌమ్యత తనను విస్మయానికి గురిచేశాయని కతియార్ అన్నారు.