ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటుంది. విమర్షలు, ప్రతివిమర్షల మధ్య ఏపీ అట్టుడికిపోతుంది. పలు చోట్ల పలు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నేతలు జనసేనను టార్గెట్ చేస్తూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ‘వారాహి’ వాహనాన్ని సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వాహనానికి నిషేధిత రంగు వేశారంటూ వైకాపాకు చెందిన మాజీ మంత్రి పేర్ని నాని చేసిన విమర్శలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. నా సినిమాలను అడ్డుకున్నారు, విశాఖ వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు, విశాఖ నుంచి బలవంతంగా పంపించేశారు, మంగళగిరిలో నా కారులో వెళ్తుంటే అడ్డుకున్నారు, ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న నన్ను ఆపేశారు, ఇప్పుడు వాహనం రంగుపైనా వివాదం చేస్తున్నారు అని మండిపడ్డారు. కనీసం ముదురు ఆకుపచ్చ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్వీట్ చేశారు. ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా?” అని ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement