హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆగస్టు 18న రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తున్న జవాన్లకు రాఖీలు పంపేందుకుగాను ఆర్మీ పోస్టల్ డైరెక్టరేట్‌తో కలిసి పోస్టల్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జవాన్, కేరాఫ్ 1సీబీపీవో, న్యూఢిల్లి చిరునామాకు రూ.41 చెల్లించి తెలంగాణలోని 6214 పోస్టాఫీసుల నుంచి రాఖీలను స్పీడ్ పోస్ట్ చేయవచ్చని
హైదరాబాద్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 10వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఫ్రమ్ అడ్రస్, పేరు లేకుంండా రాఖీలు పంపాలని కోరింది. ఆజాదీకా అమృత్ ఉత్సవాలను పురస్కరించుకుని స్కూళ్లు, కాలేజీల్లో ఈ విషయమై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.