Monday, November 25, 2024

అన్న‌కు నిప్పంటించిన చెల్లి.. ఎందుకో తెలుసా..!

నిజాంపేట : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో వృద్ధుడిపై హత్యాయత్నం చేసిన సంఘటన నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. చల్మెడ గ్రామానికి చెందిన శాల సుదర్శన్‌పై అతని స్వంత చెల్లెలు మరియు ఆమె కుమారులు ఆస్తి తగాదాలు, మరియు మంత్రాల నెపంతో అతనిపై పెట్రోల్‌ పోసి హత్యయత్నానికి యత్నించారన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు సకాలంలో ఘటన స్థలానికి చేరుకుని సుదర్శన్‌ను రక్షించి మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై వృద్ధుడి కుమారుడు హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం జరిగిందని రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement