ప్రభ న్యూస్ : దోమలు మనుషులను ఎందుకు కుడతాయి.. అదే పనిగా కొంతమందిని టార్గెట్ చేసుకుని ఎందుకు అటాక్ చేస్తాయి.. అయితే.. మనుషుల బ్లడ్ అంటే వాటికి చాలా ఇష్టమని కాదు.. వాటి గుడ్ల కోసం మానవుల రక్తం తాగుతాయట. అవును.. అవి వాటి గుడ్లకు ప్రోటీన్లను అందించడం కోసం మానవుల రక్తాన్ని తాగుతాయి. ఒక ఆడ, మగ దోమ జత కట్టినప్పుడు.. ఆడ దోమలో గుడ్లు ఉత్పత్తి కావడానికి సరైన సోషకాలు కావాల్సి ఉంటుంది. అందుకు అవి మనిషి రక్తాన్ని తాగుతాయి.
ఒక దోమ మనిషి రక్తం ఆహారంగా తీసుకున్నాక రక్తం అరగి గుడ్లు అభివృద్ధి చెందడానికి 3 నుంచి 4 రోజుల సమయం పగడుతుంది. ఒక్కసారి సేకరించిన రక్తంతో ఒక్క ఆడ దోమ దాదాపు 200 నుంచి 300 గుడ్లు పోదగగలదు. ఆడ దోమలు రక్తం తాగడంలొ బిజీగా ఉంటే మగ దోమలు మాత్రం తేనేటీగల లాగ పువ్వుల నుంచి తేనేను సేకరిస్తాయి. దాదాపు అన్ని దోమలు వాటి గుడ్లను నీటిలోనే పోదుగుతాయి. అంతే కాకుండా ఏ, బీ బ్లడ్ గ్రూపుల వారితో పాటు ఏబీ పాజిటివ్ ఉన్న బ్లడ్ గ్రూపుల వారిని దోమలు ఎక్కువగా కుడతాయని కొన్ని అధ్యయానాలు చెబుతున్నాయి. ఎందుకంటే వీరి శరీరం నుంచి వచ్చే ఒక రకమైన వాసనను పసిగట్టి దోమలు అటాక్ చేస్తాయట.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital