Friday, November 22, 2024

మ‌న దేశంలో అత్యంత సూప‌ర్ క్లీన్ రివ‌ర్ ఎక్క‌డ ఉందో తెలుసా…

ప్ర‌భ‌న్యూస్: మనదేశంలో గంగా, యమున మొదలు అనేక నదులు నానాటికీ కలుషితం అవుతున్నా యి. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం నదీజలాల పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో నదీజలాలను పరిశుభ్రం చేయడానికి పూనుకుంది. అయితే, ఈశాన్య భారతంలోని ఓ నది కాలుష్యానికి దూరంగా, అత్యంత స్వచ్ఛతతో అబ్బురపరుస్తోంది. నీలి రంగులో నదీజలాలు మిలమిల మెరుస్తున్నాయి. నదిలోని రాళ్లు రప్పలు.. బండరాళ్లు.. నాచు..పీచు.. అణువణువు అద్దంలోంచి చూసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ నదిని చూస్తే మనమున్నది భూలోకమా? స్వర్గలోకమా? అనే సందేహం కలగకమానదు. ఈ నదిపేరు ఉంగోట్‌. ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మెఘాలయాలో ఉన్నది. ఆ నది అందాన్ని, పరిశుభ్రతను పొగుడుతూ జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌ చేసింది. అందులో నదిని కాలుష్యం బారిన పడకుండా శభ్రంగా కాపాడినందుకు .. మేఘలయ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసింది. ఈ నది ప్రపంచం లోనే అందమైన నదులలో ఒకటిగా ప్రభుత్వం పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement