Friday, November 22, 2024

ఐపీఎల్​ కప్పుపై సంస్కృత పదాల‌కు అర్థం తెలుసా?

ఇవ్వాల‌ IPL ఫైనల్ మ్యాచ్‌ చెన్నై, గుజరాత్ మధ్య జరగనుంది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్, IPL, ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇందులో లీగ్ రౌండ్లు గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగాయి. ఈ ఏడాది మార్చి 31న ప్రారంభమైన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. ఇదిలా ఉండగా ఐపీఎల్ ట్రోఫీపై సంస్కృతంలో ఒక లైన్‌ రాసి ఉండడంపై ఇంటర్నెట్‌లో పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. వాటికి సమాధానం చూద్దాం.

- Advertisement -

అర్థం ఏమిటి..

కప్పు మధ్యలో సంస్కృతంలో “య‌త్ర ప్రతిభా అవసరాల ప్రాప్నోతిహి” అని రాసి ఉంటుంది. దీని అర్థం “ప్రతిభకు అవకాశం ఉన్నచోట”అని అర్థం.. కాగా, ఐపీఎల్ సిరీస్‌ను ఒకే లైన్‌లో ఇలా ప్రతిబింబించేలా ఉండడం విశేషంగా చెబుతారు. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఐపీఎల్ సిరీస్ స్ఫూర్తి. చాలా మంది ఆటగాళ్లను గుర్తించి ఐపీఎల్ నిషేధించింది. ఐపీఎల్ చాలా మంది యువ ఆటగాళ్లకు గుర్తింపు పొందేందుకు.. అనుభవజ్ఞులు పునరాగమనం చేయడానికి వేదికగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement