టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇక సరికొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇప్పటికే భారత జట్టుకు దూరమైన సాహా, దేశవాళీలో బెంగాల్ జట్టు నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా త్రిపుర తరఫున ఆడే జట్టుకు వృద్ధిమాన్ సాహా మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు అధికార వర్గాల సమాచారం. 37ఏళ్ల వృద్ధిమాన్ సాహా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్ చేజిక్కించుకోవడంలో క్రియాశీల పాత్ర పోషించారు. 2008లో బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాహా 122 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.