Friday, November 22, 2024

ODI World Cup | పాకిస్తాన్‌కు చావోరేవో..! రేపు దక్షిణాఫ్రికాతో కీలకపోరు

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో టైటిల్‌ ఫేవరెట్‌లలో ఒకటిగా బరిలోకి దిగిన పాకిస్తాన్‌ ఇప్పుడు హ్యాట్రిక్‌ ఓటములతో టోర్నీ నుంచి నిష్రమించే స్థితికి చేరింది. తొలి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న పాకిస్తాన్‌ ఆ తర్వాత వరుస ఓటములతో బొల్తా పడింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన పాక్‌ 2 విజయాలు మాత్రమే సాధించి 4 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఇక శుక్రవారం చెన్నై వేదికగా పటిష్టమైన దక్షిణాఫ్రికాతో పాక్‌ టీమ్‌ పోటీ పడనుంది.

ప్రస్తుతం సఫారీ జట్టు నాలుగు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టును ఓడించడం పాక్‌కు కఠినమైన సవాలే. కానీ టోర్నీలో నిలవాలంటే ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్‌ నెగ్గాల్సిందే. అందుకే పాక్‌కు ఈ మ్యాచ్‌ చావోరేవోగా మారింది. ప్రపంచ అగ్రశ్రేణి బౌలింగ్‌ లైనప్‌ కలిగిన పాక్‌ ప్రపంచకప్‌లో మాత్రం ఘోరంగా తేలిపోయింది.

- Advertisement -

నసీం షా గాయం నుంచి మెగా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. మిగతా బౌలర్లు దారళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. చివరి మ్యాచ్‌లో పసికూన అఎn్గానిస్తాన్‌పై 282 పరుగుల లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేక పోయారు. కీలక పేసర్‌ షాహిన్‌ షా అఫ్రిదీ వరుసగా విఫలమవుతున్నాడు. హసన్‌ అలీ గత మ్యాచ్‌లో పర్వలేదనిపించినా తమ జట్టును గెలిపించలేక పోయాడు. హరీస్‌ రవూఫ్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, ఉసామా మీర్‌లు కూడా సత్తా చాటుకోలేక పోతున్నారు.

స్టార్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ను ప్రతి మ్యాచ్‌లో ఆడించకపోవడం పాక్‌ మాజీలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. గత మ్యాచ్‌లో షాదాబ్‌ ఆడిన వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. ఇక బ్యాటింగ్‌లో ఇద్దరు ముగ్గురే రాణిస్తున్నారు. ఒక మ్యాచ్‌లో రిజ్వాన్‌ రాణిస్తే మరో మ్యాచ్‌లో బాబర్‌ ఆజమ్‌ పర్వాలేదనిపిస్తున్నాడు. అలాగే ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ కూడా ఆకట్టుకోలేక పోతున్నాడు. అబ్దుల్లా షఫీక్‌ మాత్రం మంచి ప్రదర్శనలతో సత్తా చాటుతున్నాడు.

కానీ అతనికి మంచి సహకారం అందడంలేదు. మరోవైపు సౌద్‌ షకీల్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌ ఆశించిన స్థాయిలో రాణించడంలేదు. షాదాబ్‌ ఖాన్‌ తాను ఆడిన మ్యాచుల్లో మాత్రం పర్వాలేదనిపించాడు. ఓవరాల్‌గా మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న కూడా బ్యాటర్లు ఫామ్‌లేమితో సతమతమవడం పాక్‌ను కలవరపెడుతోంది. ఇక అందరూ కలిసి కట్టు రాణిస్తే సఫారీలపై గెలవడం సులభమే.

జోరు కొనసాగాలి..

మరోవైపు పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా మరో విజయంపై కన్నేసింది. ఇప్పటికే నాలుగు విజయాలతో జోరుమీదున్న సఫారీలు అదే జోరు పాక్‌ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది. ప్రస్తుతం సఫారీ బ్యాటర్లు ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, హెండ్రిక్స్‌, మర్క్‌రమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, వాన్‌ డర్‌ డుస్సెన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. ఎలాంటి బౌలింగ్‌ లైనప్‌ అయినా సరే చీల్చి చెండాడుతున్నారు.

భారీ పరుగులు సాధిస్తూ శతకలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో మూడు సెంచరీలతో చెలరేగిన డికాక్‌ 5 ఇన్నింగ్స్‌లలో 81.40 సగటుతో 407 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లోనూ సఫారీ జట్టు మంచి ప్రదర్శనలు చేస్తోంది. ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో దక్షిణాఫ్రికా బౌలర్లు సఫలమవుతున్నారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ప్రొటిస్ట్‌ జట్టుకే విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి దిగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement