హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఏఈజేవో713 బ్యాచ్ థైరోనార్మ్ టాబ్లెట్లను వాడొద్దని తెలంగాణ ప్రజలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. ఇవి ఇళ్లల్లో ఉన్న లేదా షాపులలో ఉన్నా వెంటనే తిరిగి ఇచ్చివేయాలని స్పష్టం చేసింది. 25 ఎంసిజి టాబ్లెట్లకు బదులుగా 88 ఎంసిజి పేరుతో పొరపాటున లేబుల్ వేసిన కంపెనీ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తోందని పేర్కొంది.
ఈ తప్పిదాన్ని గుర్తించిన కంపెనీ వెంటనే టాబ్లెట్లను రీకాల్ చేసిందనీ, అయితే, ఇప్పటికే బహిరంగ మార్కెట్లో మందుల షాపులలో కొన్న ప్రజలు వెంటనే తిరిగి సంబంధిత షాపులలో ఇచ్చివేయాలని విజ్ఞప్తి చేసింది. థైరోనార్మ్ 3073 బాటిళ్లు తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చేరాయనీ, వీటిని కూడా కంపెనీ రీకాల్ చేస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.