Tuesday, November 26, 2024

రిల్‌కు తక్కువ ధరలకే ఉత్పత్తులు ఇవ్వొద్దు.. కన్స్యూమర్‌ కంపెనీలకు సేల్స్‌మెన్‌ హెచ్చరిక

న్యూఢిల్లీ : కన్స్యూమర్‌ కంపెనీలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి కనిష్ఠ ధరలకే ఉత్పత్తులను అందిస్తే సప్లయిలో ఇబ్బందులు కలగజేస్తామని చిన్న కంపెనీలను గృహవినియోగ వస్తువుల సేల్స్‌మెన్స్‌ హెచ్చరించారు. ఈ మేరకు వార్తా సంస్థ రాయిటర్స్‌ ఒక లేఖను ప్రస్తావించింది. గతేడాది తమ అమ్మకాలు 20 -25 శాతం మేర పడిపోయాయని రెక్కిట్‌ బెన్‌కిసర్‌, యూనిలీవర్‌, కోల్గెట్‌ – పామోలివ్‌ వంటి కంపెనీలకు చెందిన సేల్స్‌మెన్‌ పేర్కొన్నారు. ముకేష్‌ అంబానీ నేతృతంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో చిన్న చిన్న స్టోర్ల భాగసామ్యం పెరుగుతుండడమే ఇందుకు కారణమని సేల్స్‌మెన్‌ అంటున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు ఇస్తుండడంతో జియోమార్ట్‌ పార్టనర్‌ యాప్‌ నుంచి ఆర్డర్లు ఇచ్చేందుకు మరిన్ని స్టోర్లు ముందుకొస్తున్నాయి. దీంతో 450,000 సేల్స్‌మెన్‌ మనుగడకు ముప్పు ఏర్పడింది.

సేల్స్‌మెన్‌ ఎన్నో ఏళ్లుగా దేశం నలుమూలలా స్టోర్ల నుంచి ఆర్డర్లు తీసుకుంటూ తమ సేవలు అందిస్తున్నారు. 4 లక్షల మంది సేల్స్‌మెన్‌ సభ్యులుగా ఉన్న ఆలిండియా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఫెడరేషన్‌.. కన్స్యూమర్‌ కంపెనీలకు ఒక లేఖ రాసింది. అందరికీ సమాన ఉండాలని, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాదిరిగానే ఇతర పెద్ద పెద్ద కార్పొరేటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఉత్పత్తులను అందించాలని లేఖలో డిమాండ్‌ చేసింది. ధరలు సమానంగా ఉండాలనే డిమాండ్‌ను అనుసరించకపోతే చిన్న స్టోర్లకు ఉత్పత్తుల డిస్ట్రిబ్యూషన్‌ను ఆపివేస్తారని లేఖలో యూనియన్‌ పేర్కొంది. జనవరి 1 తర్వాత కూడా భాగస్వామ్యం కొనసాగితే కొత్తగా విడుదల చేసే ఉత్పత్తులను స్టోర్లకు పంపిణీ చేయబోమని హెచ్చరించారు. విశ్వాసాన్ని చూరగొన్నాం. రిటైలర్లలో తమపై నమ్మకం ఉంది. ఎన్నో ఏళ్లుగా వారికి సర్వీసులు అందించాం. సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునివ్వాలని నిర్ణయించామని లేఖలో యూనియన్‌ సభ్యులు స్పష్టం చేశారు. గ్రూప్‌ ప్రెసిడెంట్‌ ధైర్యశిల్‌ పాటిల్‌ స్పందిస్తూ.. రెకిట్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, కోల్గెట్‌తోపాటు ఇతర 20 కన్స్యూమర్‌ గూడ్స్‌ కంపెనీలకు లేఖ పంపించినట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement