Friday, November 22, 2024

ప్రైవేట్‌ యూనివర్శిటీలకు అనుమతులివ్వొద్దు.. ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్‌ యూనివర్శిటీలకు అనుమతులు ఇవ్వొద్దని, కొత్తగా ఏర్పాటు చేసుకునేందుకు 6 యూనివర్శిటీలకు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ యూనివర్శిటీల్లో సౌకర్యాలు కల్పించకుండా విద్యను వ్యాపారంగా మార్కెట్‌ సరుకును చేసే ప్రైవేట్‌ వర్శిటీలకు అనుమతులు ఎలా ఇస్తారని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆర్‌ఎల్‌.మూర్తి, నాగరాజు ప్రశ్నించారు. వాటిలో రిజర్వేషన్ల అమలు, ఫీజుల నియంత్రణ పాటించకున్నా ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంందని ఆరోపించారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే ప్రైవేట్‌ వర్శిటీల ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement