Tuesday, November 19, 2024

శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఊరుకోం: చీఫ్ విప్ వినయ్ భాస్కర్

వరంగల్ కార్పొరేషన్, (ప్రభన్యూస్): తెలంగాణలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలోని 50వ డివిజన్ విద్యుత్ నగర్ లో వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు.. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు తెలంగాణలో అల్లర్లకు ఆజ్యం పోసి.. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేలని చూస్తున్నారని, రాష్ట్రంలో అభివృద్ధిని చూడడానికి వచ్చిన అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మకు స్వాగతం తెలుపుతున్నానని, కానీ దొడ్డి దారిలో.. సీఎం ను రాజకీయం కోసం.. వాడుకుంటున్నారని అన్నారు.


ఇదే సీఎం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బీజేపీవాళ్లు కేసులు పెట్టి జైళ్లకు పంపిన విషయం మరిచిపోయారని వినయ్ భాస్కర్ గుర్తుచేశారు. దేశం గర్వించదగ్గ నేత సీఎం కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బందు, రైతు భీమా అందించినట్టు తెలిపారు. తెలంగాణాలో ఎక్కడైన ఆగి రైతులతో మాట్లాడాలని అస్సాం సీఎంను కోరారు. చావు నోట్లో తలను రాష్ట్రం సాధించారని, విభజన హామీల్లో ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశాకే.. వరంగల్ గడ్డపై కాలు మోపాలని ఆయన హెచ్చరించారు. 317 జీఓపై బీజేపీ రాద్దాంతం చేయడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్య క్రమంలో హనుమకొండ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, డైరెక్టర్ మాడిషెట్టి శివ శంకర్ , టీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement