Friday, September 20, 2024

TG | శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దు : సీఎం రేవంత్

తెలంగాణను డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పోలీసుకులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. బేసిక్ పోలీసింగ్‌పై శ్రద్ధ పెట్టాలని.. డయల్ 100/112 రెస్పాన్స్‌ను పటిష్ఠ చేయాలని సూచించారు. అలాగే మహిళలు, చిన్నారుల భద్రతు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. నేరాలపై యూనిట్ అధికారులు సమీక్షలు చేయాలని.. సీనియర్ అధికారులు సైతం ఫీల్డ్‌ విజిట్‌ చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలీసులు రోడ్లపైనే ఉండాలని, ఎప్పటికప్పుడు నేర సమీక్షలు నిర్వహించాలని, కమిషనర్లు, ఎస్పీలు, ఎస్‌హెచ్‌వోలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని ఆదేశించారు.

గతేడాదితో పోలిస్తే నేరాలు తగ్గుముఖం పట్టాయని పోలీసు ఉన్నతాధికారులు వివరించగా… వాటిని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కల్తీ పురుగుమందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని… కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తారని, అలాంటివి చేయకుండా జాగ్రత్తపడాలని హెచ్చరించారు.

అట‌వీ భూముల్లో పండ్ల మొక్క‌లు నాట‌డాన్ని ప్రోత్సహించి తద్వారా గిరిజ‌నుల‌కు ఆదాయం పెంచాలని… ప్రాజెక్టు కట్టలు, కాలువ గట్టులు, రహదారుల వెంట తాటి, ఈత చెట్లు నాటాల‌ని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలని అదేశించారు.

- Advertisement -

కలెక్టర్లు పాఠశాలలను నిత్యం తనిఖీ చేయాలని.. డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క‌తో పాటు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement