Saturday, November 23, 2024

ఒక్క సీటు కూడా రాని పరిస్థితి తెచ్చుకోవద్దు : రఘురామ కృష్ణ రాజు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా రాని పరిస్థితి తెచ్చుకోవద్దని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు హితవు పలికారు. ప్రజారాజకీయం చేయాలి తప్ప కుల రాజకీయం చేయడం మంచిది కాదని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటనకు ఏరోజూ రానంత జనం వచ్చారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు పశ్చాత్తాపంతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఏపిలో రోడ్ల పరిస్థితి గురించి చిన్నజీయర్ స్వామి చాలా సున్నితంగా విమర్శించారని గుర్తుచేస్తూ, ఇప్పుడు ఆయన్ని కూడా దుష్ట చతుష్టయంతో కలుపుతారా అంటూ ప్రశ్నించారు. ఏపిపీఎస్సీలో పరీక్షలు నిర్వహించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందని విమర్శించారు. శ్రీలంకలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఏపీలో ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినందుకు ట్విట్టర్లో థ్యాంక్యూ సీఎం అంటూ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ట్వీట్ చేశారని, తనను వేధించి, హింసించినందుకు సునీల్ కుమార్‌కు వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు టిక్కెట్ ఇచ్చి సత్కరించనున్నారని రఘురామ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement