న్యూఢిల్లీ: ధక్షిణాఫ్రికాలో వెలుగులోకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ (బి.1..1.529) సంబంధించి దేశంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ వేరియంట్ వ్యాప్తి గురించి భయాందోళనలు వీడి, కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని కేంద్రం కీలక ప్రకటన చేసింది.
కొత్త వేరియంట్ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతోపాటు హాంకాంగ్‌ల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించి, పా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే… వారిని కొవిడ్ కేర్ సెంటర్లలోఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital