కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణలో 10 రోజుల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అయితే కొంతమంది తమ కుటుంబీకులు, బంధువులు, ఇతర అవసరాల కోసం బయటకు వెళ్లాల్సి రావొచ్చు. లాక్‌డౌన్‌లో ఎమర్జెన్సీగా వెళ్లేందుకు, వేరే జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాలంటే తెలంగాణ పోలీసులు ఈ-పాస్ తప్పనిసరి చేశారు. ఇందుకోసం మీరు policeportal.tspolice.gov.in సైట్ ఓపెన్ చేసి, E-passపై క్లిక్ చేయాలి. జిల్లా, పేరు, ఐడీ ప్రూఫ్ వివరాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి ఇలా అన్ని ఫిల్ చేయాలి. అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వస్తుంది. హోం పేజీలోకి వెళ్లి ‘Citizen Print Pass’పై క్లిక్ చేసి ఆ నెంబర్ ఎంటర్ చేస్తే పాస్ వస్తుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement