త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకే అధినేత స్టాలిన్ తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలను తగ్గిస్తామని డీఎంకే హామీ ఇచ్చింది. లీటరు పెట్రోల్‌పై 5, డీజిల్‌పై 4 తగ్గిస్తామని తెలిపింది. అటు వంట గ్యాస్ సిలిండర్‌పైనా రాయితీ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఇంకా మేనిఫెస్టోలో ఏం హామీలు ఉన్నాయంటే..
✿ ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంపు
✿ వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 రాయితీ
✿ పెంచిన ఆస్తి పన్ను రద్దు
✿ ఆవిన్ పాలధరపై లీటర్‌పై రూ.3 తగ్గింపు
✿ ప్రభుత్వ ఉద్యోగాల్లో 40% మహిళలకు అవకాశం
✿ విద్యా, ఉపాధికి అధిక ప్రాధాన్యత
✿ హిందూ ఆలయాల పునరుద్ధరణకు రూ.1000 కోట్లు
✿ మసీదు, చర్చిల పునరుద్ధరణకు రూ.200కోట్లు
✿ అధికారంలోకి రాగానే పెట్రోల్ ధరల తగ్గింపు
✿ తమిళనాడు వ్యాప్తంగా కలైంజ్ఞర్ క్యాంటీన్లు
✿ జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా కమిషన్