ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరుల జాబితాలో భారత్‌కు చెందిన డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ చేరిపోయారు. ప్రపంచంలోని టాప్ 100 మంది కుబేరుల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. బ్లూమ్ బర్గ్ ప్రకటించిన బిలియనీర్స్ జాబితాలో దమానీకి 98వ స్థానం లభించింది. దమానీ నికర సంపద రూ.1.38 లక్షల కోట్లుగా బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది.
మన దేశంలో రీటెయిల్ సరుకుల చెయిన్ మాల్స్ ను డీమార్ట్ నిర్వహిస్తోంది. ఇతర మాల్స్ కంటే తక్కువ ధరకు సరుకులను అందిస్తూ వినియోగదారులకు డీమార్ట్ దగ్గరైంది. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ సంస్థ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. కరోనా సమయంలో అత్యధిక లాభాలు సంపాదించిన సంస్థల్లో డీమార్డ్ ముందు వరుసలో ఉంది. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, నిత్యావసర సరుకులను, వస్తువులను వినియోగదారులకు అందించడం ద్వారా… డీమార్ట్ తన వ్యాపారాన్ని అనేక రెట్లు పెంచుకుంది. మరోవైపు ప్రపంచ అగ్రశ్రేణి కుబేరుల జాబితా టాప్-10లో భారత్ నుంచి ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, అజీమ్ ప్రేమ్ జీ, పల్లోంజీ మిస్త్రీ, శివ నాడార్, లక్ష్మీ మిట్టల్ ఉన్నారు.
ఈ వార్త కూడా చదవండి: జియో నుంచి మరో అద్భుతమైన ఆఫర్.. రూ.98కే 1.5 జీబీ