Tuesday, November 26, 2024

లాక్‌డౌన్ ఎఫెక్ట్: 132 శాతం పెరిగిన డీమార్ట్ లాభాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో డీమార్ట్ మంచి ఫలితాలు సాధించింది. లాక్‌డౌన్ ఎఫెక్ట్ కారణంగా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గాను కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.95.36 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయానికి రూ.40కోట్లు మాత్రమే సాధించినట్లు డీమార్ట్ తెలిపింది. అంటే ఈ ఏడాది రెండింతల లాభాన్ని డీమార్ట్ సొంతం చేసుకుంది.

మరోవైపు మొత్తం కంపెనీ ఆదాయం కూడా రూ.3883 కోట్ల నుంచి రూ.5183 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో మొత్తం వ్యయాలు కూడా రూ.3875 కోట్ల నుంచి రూ.5077 కోట్లకు పెరిగినట్లు డీమార్ట్ ప్రకటించింది. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది క్యూ1 ప్రారంభంలోనూ స్థానికంగా కఠిన లాక్‌డౌన్‌లు అమలైనప్పటికీ మూడు, నాలుగు వారాల తదుపరి ఆంక్షలు తొలుగుతూ వచ్చినట్లు డీమార్ట్ గుర్తుచేసింది. అయినా గత ఏడాది కంటే రెట్టింపు లాభాన్ని కంపెనీ ఆర్జించడం గమనార్హం.

ఈ వార్త కూడా చదవండి: మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

Advertisement

తాజా వార్తలు

Advertisement