Friday, November 22, 2024

ఢిల్లీ లో డీకే – సీఎం అభ్యర్థి పేరును నేడు ప్రకటించే అవకాశం

న్యూ ఢిల్లీ – కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మంగళవారంనాడు బెంగుళూరు నుండి ఢీల్లీకి బయలుదేరి వెళ్లారు. సోమవారంనాడే డీకే శివకుమార్ ను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలిచింది. . న్యూఢిల్లీకి చేరుకన్న డీకే శివకుమార్ ఎఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీతో కూడా సమావేశం అవుతారు

నిన్న ఆరోగ్య కారణాలతో డీకే శివకుమార్ మాత్రం ఢీల్లీకి వెళ్లలేదు. ఇవాళ ఉదయం డీకే శివకుమార్ బెంగుళూరు నుండి న్యూఢిల్లీకి బయలుదేరారు. గత నాలుగు రోజులుగా కడుపునొప్పితో డీకే శివకుమార్ బాధపడుతున్నారు. ఈ విషయాన్ని డీకే శివకుమార్ నిన్న సాయంత్రం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య నిన్ననే ఢీల్లికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను సిద్దరామయ్య కలిశారు. అయితే నిన్న న్యూఢిల్లీకి డీకే శివకుమార్ వెళ్లలేదు. దీంతో డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ నిన్న రాత్రి ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మరికొందరు కాంగ్రెస్ నేతలను కూడా డీకే సురేష్ కలిశారు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే కర్ణాటక సీఎం ఎవరనే విషయమై కాంగ్రెస్ నాయకత్వం ఇంకా తేల్చలేదు. ఇవాళ డీకే శివకుమార్, సిద్దరామయ్యతో చర్చించిన తర్వాత సీఎం అభ్యర్ధిని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించనుంది. . ఎమ్మెల్యేల అభిప్రాయాలను డీకే శివకుమార్, సిద్దరామయ్యల సమక్షంలో కాంగ్రెస్ పరిశీలకుల బృందం ప్రకటించే అవకాశం ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement