హుజూరాబాద్ ఉప ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆరు రౌండ్లు ముగిశాయి. కాగా బిజెపి ముందస్తులో ఉండటం విశేషం. ఈ ఫలితాలను చూస్తోంటే టిఆర్ ఎస్ సర్కార్ కి ఉన్న క్రేజ్ తగ్గిందా..కేసీఆర్ స్టామినా ఇదేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానిక నేత ఈటల రాజేందర్ వైపే ప్రజలు మొగ్గు చూపారనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ నేత డీకే అరుణ మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల నమ్మకం పోగొట్టకుందని.. భారీ మెజారిటీ తో ఈటెల గెలుస్తారని స్పష్టం చేశారు హుజూరాబాద్ ఉప ఎన్నికల మేమే గెలుస్తాం అని మొదటి నుండి చెప్పామని… హుజూరాబాద్ ప్రజల తీర్పుకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు.కేసిఆర్ అహంకారం కి హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఓ గుణపాఠమని… హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. ఈటెల…కేసీఆర్ మధ్యనే పోటీ అన్నట్టు ఎన్నిక జరిగిందని… వచ్చే ఎన్నికల నాటికి గ్రామ గ్రామానికి పార్టీ విస్తరిస్తుందన్న ధీమాని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలని సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement