Thursday, November 21, 2024

ముగిసిన‌ ఏపీ భవన్ పంచాయితీ.. ఇరు రాష్ట్రాల అంగీకారం

ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పంచాయితీ ముగిసింది. ఏపీ భవన్ విభజనపై రెండు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో శనివారం ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీ అశోకా రోడ్డు, మాధవరావు సింధియా మార్గ్‌ల వెంబడి రెండు రాష్ట్రాలకు కలిపి 19.733 ఎకరాల భూమి ఉంది. తెలంగాణ వాటాగా 8.245 ఎకరాలు, ఏపీ వాటాగా 11.536 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3 ఎకరాలు, పటౌడీ హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించారు.

ఏపీకి 5.781 ఎకరాలు ఉన్న గోదావరి బ్లాక్‌, స్వర్ణముఖి బ్లాక్‌లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నర్సింగ్ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడీ హౌస్‌లో 2.396 ఎకరాలు ఏపీకి కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement