Friday, November 22, 2024

మరో వారంలో జిల్లాల వారీగా టీచర్ల నియ‌మ‌కాలు..

ప్ర‌భ‌న్యూస్: రాష్ట్రంలోని టీచర్ల క్యాడర్‌ స్ట్రెంత్‌ ప్రక్రియ స్పీడప్‌ అందుకుంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రిను పూర్తి చేసేందుకు అధికారులు సిద్ద‌మ‌వుతున్నారు. కొత్త జిల్లాల ప్రకారం క్యాడర్‌ స్ట్రెంత్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఈమేరకు కార్యాచరణ రూపొందించి పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే గురువారం అన్ని జిల్లాల డీఈవోలతో డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలో క్యాడర్‌ స్ట్రెంత్‌పై ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా శాంక్షన్డ్‌ పోస్టులు ఎన్ని, భర్తీ అయిన పోస్టులు, ఖాళీలెన్ని అని లెక్కలు తీస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పాత పోస్టులను కొత్త జిల్లాల కు సర్దుబాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి.

దీంతో ఉమ్మడి జిల్లాలోని కొత్త జిల్లాలకు వెళ్లేందుకు ఉపాధ్యాయులకు ఆప్షన్లు ఇవ్వనున్నారు. ఒకవేళ అవసరానికి మించి ఉంటే ముందుగా అవకాశం మాత్రం సీనియారిటీ ప్రకారం వారు కోరుకునే జిల్లాను సీనియర్లకు ఇచ్చి, జూనియర్లకు ఉమ్మడి జిల్లా పరిధిలోని మిగిలిన జిల్లాలకు పంపించనున్నారు. ప్రస్తుతం 1.20 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లుగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. జిల్లాల వారీగా పోస్టుల సర్దుబాటు అనంతరం ప్రమోషన్లు, బదిలీలు చేపట్టే అవకాశం ఉంది. మరో వారం పది రోజుల్లో కొత్త జిల్లాల వారీగా టీచర్ల క్యాడర్‌ స్ట్రెంత్‌ తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలోని ఉద్యోగుల క్యాడర్‌ స్ట్రెంత్‌ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement