నవీపేట్, ప్రభ న్యూస్ : నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ లు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఏటి ఎస్ శ్రీనివాస్ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆదివారం రోజున హైదరాబాదులోని అతని నివాసంలో సర్పంచులతో కలిసి భేటీ అయ్యారు. జిల్లాలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసంతృప్తితో నిరసన బాట పట్టగా సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఏటిఎస్ శ్రీనివాస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తాము ఎదుర్కొంటున్న 14 సమస్యలపై గంటన్నర పాటు చర్చించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి వెంటనే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్తానని చెప్పడమే గాక, సంబంధిత అధికారులతో సమస్యల పరిష్కార మార్గాల విషయమై కులంకశంగా మాట్లాడారని, త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఏటిఎస్ శ్రీనివాస్ తెలిపారు. సర్పంచ్ ల సమస్యలపై స్పందించి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తున్న మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రాజేశ్వర్, ఉపాధ్యక్షులు రాజారెడ్డి, కోశాధికారి నరహరి సభ్యులు శంకర్, ఆనంద్, గంగా ప్రసాద్, శ్రీనివాస్ రావు, అమనుల్లా, రమేష్, మహేష్, గంగారెడ్డి, లక్ష్మీరాజ రెడ్డి తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement