Sunday, November 17, 2024

తెలంగాణలో సినిమా థియేటర్ల పున:ప్రారంభంపై నీలినీడలు

టాలీవుడ్ సినీ నిర్మాతలకు తెలంగాణ ప్రాంత డిస్ట్రిబ్యూటర్లు షాకిచ్చారు. సినిమా థియేటర్ల పునఃప్రారంభానికి 100 శాతం సామర్థ్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా థియేటర్లను తెరిచేందుకు డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు, సినీ ప్రముఖులు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. థియేటర్లను తెరిచే అంశంపై చర్చలు జరిపారు. అయితే అందుకు డిస్ట్రిబ్యూటర్లు ససేమిరా అన్నారు.

ఓటీటీల వల్ల థియేటర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తాయని… ఓటీటీల నుంచి థియేటర్లను రక్షించాలని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు. ఓటీటీల్లో సినిమాల విడుదలను ఆపేంత వరకు థియేటర్లను తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో, నిర్మాతలకు షాక్ తగిలింది. ఇప్పటికే తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు పలువురు నిర్మాతలు సన్నాహకాలు చేసుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు తమ నిర్ణయాన్ని తెగేసి చెప్పడంతో థియేటర్ల పునఃప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో, నిర్మాతలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: సినీ పరిశ్రమకు ఏపీ సర్కారు షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement