Saturday, November 23, 2024

Delhi | శ్రీవేంకటేశ్వరుడి సన్నిధిలో అయోధ్య అక్షింతల పంపిణీ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: న్యూఢిల్లీలోని తిరుమల శ్రీనివాస ఆలయం గోవింద-జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిపోయింది. శ్రీరాముడి ఆశీర్వాదం, ఆహ్వానంగా భారతదేశంలోని ప్రతి ఇంటికీ చేరుతున్న అయోధ్య అక్షింతలు మందిర్ మార్గ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాజీ ఆలయానికి చేరుకున్నాయి. అయోధ్య రామయ్య చరణాల వద్ద ఉంచి పూజలు చేసిన అక్షింతల కలశాన్ని శనివారం వేదపండితులు నెత్తిన పెట్టుకుని జైశ్రీరామ్ మంత్రోచ్చారణతో ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ధ్యానమందిరంలో భక్తులకు అక్షింతలు, భవ్య వందిర ఫొటో, శ్రీరాముడి కరపత్రాలను పంపిణీ చేశారు. 500 ఏళ్ల తర్వాత రామ్ లల్లా తన జన్మభూమికి తిరిగి వస్తున్న అద్భుత దినాన్ని గొప్ప దీపావళిగా జరుపుకోవాలని ఆర్ఎస్‌ఎస్ నేత పిలుపునిచ్చారు. అయోధ్య అక్షింతలను ఈనెల 22వ తేదీన  రాముడికి ప్రాణ ప్రతిష్ట అనంతరం ఇంట్లోని అక్షింతల్లో కలిపి అందరి తలల మీద వేసుకోవాలని పండితులు చెప్పారు. దక్షిణాది భక్తులతో పాటు ఉత్తరాది వారూ పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామి వారి అక్షింతలను తీసుకున్నారు. స్వామి వారే తమ కోసం స్వయంగా అక్షింతలు పంపారని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement