టీమిండియాలో రిషభ్ పంత్ ప్రదర్శనపై మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడని సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ కె.శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ‘ఎన్నడా పంతు..ఇలాగైతే ఎలా? ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇలా తదబడటం మంచిది కాదు.
బహుశా పంత్కి మేనేజ్మెంట్ కొంత విరామం ఇవ్వాలేమో. పంత్ ప్రదర్శన విషయంలోనూ నేను నిరాశతో ఉన్నా. అతడి బ్యాటింగు మెరుగుపడాలి. పూర్తిగా ఒత్తిడికి లోనుకాక ముందే తనను తాను నిరూపించుకోవాలి’ అని శ్రీకాంత్ సూచించాడు.