Monday, November 25, 2024

మంచినీటి సరఫరాలో అంత‌రాయం .. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్‌

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ : మహానగరానికి మంచినీటిని సరఫరాలో అంత‌రాయం క‌ల‌గ‌నుంది. కృష్ణ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్ట్ (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్‌ – 3 రింగ్‌ మెయిన్‌-2కి సంబంధించిన పనుల వ‌ల్ల నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం క‌ల‌గ‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు. 1500 ఎంఎం డయా పైప్‌లైన్‌పైన నీటి లీకేజీని అరికట్టడానికి 400 ఎంఎం బటర్‌ఫ్లై వాల్వ్‌ను మార్చాల్సి ఉందని వాటర్‌బోర్డు తెలిపింది. ఈ నెల 19న అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 12 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. అందువల్ల కృష్ణ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌ ఫేజ్‌ – 3 రింగ్‌ మెయిన్‌ – 2 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఇవే…

ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) డివిజన్‌ 19లోని ప్రాంతాలు బోడుప్పల్‌, చెంగిచెర్ల, పీర్జాదిగూడలతో పాటు డివిజన్‌ నం. 21 – సైనిక్‌పురి, అల్వాల్‌ , డివిజన్‌ నం. 13 – మౌలాలి, డివిజన్‌ నం. 7లోని – లాలాపేట, తార్నాక, డివిజన్‌ నంబరు 14 – స్నేహపురి, కైలాస్‌గిరి, చర్లపల్లి పరిధిలోని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుందని వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు. అందువల్ల మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని వినియోగదారులను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement